అటల్‌జీ గురించి ఏమన్నారంటే?

భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మరణంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. అటల్ జీ కవితను గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ నివాళులర్పించగా, దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులంతా ఘననివాళులర్పిస్తున్నారు. నోట మాట రావడం లేదని బీజేపీ కురువృద్ధుడు, వాజ్ పేయి ప్రియమిత్రుడు ఎల్ కే అద్వాణీ అనగా, నిజమైన అజాతశత్రువు అటల్‌జీ అని, అతని ప్రసంగాలు వినే రాజకీయాల్లోకి వచ్చానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాజ్‌పేయి తోడ్పాటు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియ‌న్‌గా, ప్రధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్‌పేయి అస్తమయం దేశానికి తీర‌ని లోట‌ని కేసీఆర్ అన్నారు. అటల్ జీ మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మహోన్నత నేతకు మహా నివాళి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసమాన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయికి వందనం అంటూ నటుడు ఎన్టీఆర్ స్పందించారు. ఇలా దేశవ్యాప్తంగా అటల్ జీకి ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

Related News