గుంటూరులో మరో దాచేపల్లి

దాచేపల్లిని పోలిన ఘటన మళ్లీ గుంటూరు జిల్లాలోనే చోటుచేసుకుంది. గుంటూరు నగరంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు ఒక యువకుడు. దీంతో బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. యువకుడ్ని అప్పగించాలన్న డిమాండ్ కు పోలీసులు ఒప్పుకోకపోవడంతో నిరసనకారులు పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు. మరో వైపు నిరసన కారులు రాళ్లదాడిచేయడంతో పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి.

ఒక దశలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై తిరగబడ్డారు. నిందితుడ్ని తమకు అప్పగించాలని భైఠాయించారు. దీంతో గుంటూరులో అర్థరాత్రి ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధించారు.

Related News