రాజు- మంత్రి మళ్లీ కాంబో!

రానా-తేజ కాంబో రిపీట్ అవుతుందా? అవుననే అంటున్నాయి ముంబై ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం దీనికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో రానా పైలట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ముంబై కి చెందిన ఓ నిర్మాణ సంస్థ దీన్ని భారీగా నిర్మించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. వార్ మూవీ కావడంతో విజువల్స్, మిగతా పనులను హాలీవుడ్ కి చెందిన ఓ కంపెనీ కి అప్పగించాలని ఆలోచన చేస్తోందని ఇన్‌సైడ్ టాక్.

స్టోరీ విషయానికొస్తే.. 1971 నాటి ఇండో- పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. గతంలో తేజ .. రానా కాంబినేషన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే! ఘాజీలో నేవీ ఆఫీసర్‌గా కనిపించిన రానా, ఈసారి ఎయిర్‌ఫోర్స్ అధికారిగా దర్శనమీయనున్నాడు.

READ ALSO

Related News