AP and TS / Entertainment
‘మార్తాండవర్మ’ గా భల్లాల దేవ !

బాహుబలి మూవీలో భల్లాల దేవునిగా క్రేజ్ కొట్టేసిన దగ్గుబాటి రానా ‘మహారాజా మార్తాండ వర్మ’ గా నటించనున్నాడు. కేరళలోని ట్రావన్ కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ వర్మ జీవితంపై తెరకెక్కనున్న సినిమాలో రానా ’వర్మ " రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్లో తెలియజేస్తూ.. అనిళం తిరునాళ్ మార్తాండ వర్మ. . ది కింగ్ ఆఫ్ ట్రావన్ కోర్ చిత్రంలో యాక్ట్ చేయబోతున్నా..ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కె.మధు డైరెక్టర్. రాబిన్ తిరుమల స్టోరీ అందించారు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రానా " 1945 " చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సైంటిస్టు పాత్ర ఇతనిదని సమాచారం. రెజీనా హీరోయిన్.

 

 

Read Also

 
Related News