పవన్‌కి వర్మ రెండో ప్రేమలేఖ

ఉప్పు నిప్పులా మారిపోయిన పవన్ కల్యాణ్ – రామ్ గోపాల్ వర్మ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గురువారం నాటి ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ లేవనెత్తిన అన్ని అంశాలకు పాయింట్ టు పాయింట్ సమాధానం చెబుతూ గతరాత్రి సోషల్ మీడియాలో ఒక లేఖ రిలీజ్ చేశాడు వర్మ. తప్పైపోయింది.. క్షమించమంటూ వేడుకుని మరోసారి మెగా ఫ్యామిలీ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టనంటూ తల్లిమీద ప్రమాణం కూడా చేశాడు. కానీ, తెల్లవారే సరికి సీన్ మరింత వేడెక్కింది. పవన్ ట్వీట్ల మీద ట్వీట్లు కొడుతూ మీడియా మీద రంకెలేయడం మెగా‌క్యాంప్ మొత్తాన్ని వెంటబెట్టుకుని ఫిల్మ్ ఛాంబర్ లో హడావుడి చేయడం లాంటి పరిణామాలన్నీ వర్మలో మళ్లీ కదలిక తెచ్చేశాయి. పవన్ పెట్టిన ట్వీట్ల లోని సారాంశాన్ని ప్రస్తావిస్తూ.. సవివరంగా రిప్లై ఇచ్చిన వర్మ, తన సర్కాస్టిజమ్ స్టైల్‌ని కంటిన్యూ చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీకి 20వసారి క్షమాపణ చెబుతున్నానన్న వర్మ.. తిడుతున్నాడా? లేక పొగుడుతున్నాడా? అనే స్పష్టత లేకుండా సాగింది వర్మ తాజా ‘ప్రేమలేఖ’.

Posted by RGV on Friday, April 20, 2018

 

READ ALSO

Related News