బోయపాటితో చెర్రీ.. పూజ చేసి మరీ..

రంగస్థలం సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్..తన 12 వ చిత్రం షూటింగ్ కు రెడీ అయ్యాడు. ఆదివారం ఇంట్లో పూజ చేసి కొత్త సినిమా సెట్ కు చేరుకున్నాడు. చెర్రీ పూజ చేస్తున్న ఫోటోను ఆయన భార్య ఉపాసన ట్విటర్ లో పోస్ట్ చేశారు. రాం చరణ్ 12 వ సినిమాకు సర్వం సిద్ధమైంది. గుడ్ లక్ మిస్టర్ సి..అని ఆమె ట్వీట్ చేశారు.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చెర్రీకి జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ సినిమాకోసం చరణ్ తన మేకోవర్ ని పూర్తిగా మార్చుకోవడం విశేషం.

దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చునని మేకర్స్ తెలిపారు. రాజ వంశస్థుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

READ ALSO

Related News