ఎన్టీఆర్ బయోపిక్: రకుల్ ఓకే, వాళ్ల మాటేంటి?

బాలకృష్ణ- క్రిష్ కాంబోలో రానున్న సెకండ్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ గురించి లేటెస్ట్ న్యూస్. ఇందులో శ్రీదేవి రోల్‌లో రకుల్‌ ప్రీత్‌‌సింగ్ నటించనున్నట్లు టాక్. తొలుత ఈ పాత్ర కోసం మేకర్స్ కంగనా, సోనాక్షి‌సిన్హా, శ్రద్ధా‌కపూర్‌ల‌ను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. దీన్ని ఖండిస్తూ ఓ ఇంగ్లీష్ డైలీకి క్లారిటీ ఇచ్చాడు నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి.

శ్రీదేవి రోల్ కోసం ఇప్పటివరకు ఎవరినీ కలవలేదని, ఫస్ట్ ప్రయార్టీ రకుల్‌కే వుంటుందని సూచనప్రాయంగా చెప్పాడట. సౌత్‌లో ఆమెకి పాపులారిటీ వున్న విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ప్రస్తుతం ఆమె వివిధ ప్రాజెక్టులతో బిజీగా వుండడంతో కాల్షీట్లు కుదర లేదని చెప్పుకొచ్చాడు. త్వరలోనే రకుల్‌ నుంచి డేట్స్‌ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంతవరకు బాగానేవుంది. ఎన్టీఆర్ మరో ఇద్దరు హీరోయిన్లతో నటించారు. ఒకరు జయసుధ, మరొకరు జయప్రద.. వాళ్ల ప్లేస్‌లో ఎవరినైనా తీసుకుంటారా? లేక శ్రీదేవితోనే సరిపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

READ ALSO

Related News