ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేక్

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో చుక్కెదురైంది. ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో నిన్న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలంచింది. కానీ ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పేర్కొంది. చివరికి అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును టేకప్ చేయటంలేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. భర్త మూడు సార్లు తలాక్ అని చెబితే.. భార్యతో విడాకులు జరిగినట్లే నని భావించే పద్దతి రాజ్యాంగ విరుద్ధమని… దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

Related News