పబ్లిక్‌గా రాహుల్ కనుసైగలు, ఎక్కడ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మళ్లీ కన్నుగీటారు. ఈసారి కనుసైగలు వెనుక విశేషం ఏంటి? సొంత పార్టీలో విభేదాలు లేవని చెప్పడానికి ఆయన వేసిన స్కెచ్‌గా చెబుతున్నారు. రాజస్థాన్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదివారం జైపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టేజీపై రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను చూస్తూ కన్నుగీటారు రాహుల్. ఆ తర్వాత నవ్వుతూ వేదికపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ను, సచిన్‌ పైలట్‌ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

అశోక్‌ గెహ్లోట్‌- సచిన్‌‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికే రాహుల్‌‌గాంధీ ఈ విధంగా స్కెచ్ వేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రాహుల్‌ ఇలాగే కన్ను గీటారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణం సందర్భంగా మాట్లాడిన రాహుల్‌, అనంతరం వెంటనే వెళ్లి మోదీని ఆలింగనం చేసుకుని, వెనక్కి వచ్చి తన సీటులోని కూర్చొని పక్కనున్న ఓ కాంగ్రెస్‌ నేతను చూస్తూ ఆయన కన్ను గీటిన విషయం తెల్సిందే!

READ ALSO

Related News