ఏంటీ నీచ రాజకీయాలు..?

కేంద్రంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ పెద్దలు చేస్తున్ననీచ రాజకీయాల్ని ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు పూర్తి మద్దతు తెలుపకున్నా అక్రమమార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న వైనాలు ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం మింగుడుపడ్డంలేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న రాజ్యాంగ పరిహాసంతో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని భారతదేశం విచారిస్తుందని ట్వీట్ చేశారు. అటు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన రాజ్ భవన్ బయట కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

Related News