కేవలం పదిహేను నిమిషాల్లో మోదీని కడిగేస్తా !

‘మోదీజీ.. నాకో 15 నిముషాలు టైమివ్వు.. డిబేట్‌లో కూర్చుందాం..’! ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కడిగేయ్యడానికి నేను రెడీ.. నువ్వు రెడీనా.. అంటూ నిగ్గదీసి అడిగేస్తున్న రాహుల్.. తాను అడగబోయే ప్రశ్నలేంటన్నది కూడా చెప్పేస్తున్నారు. ‘సేవ్ ది కాన్స్టిట్యూషన్’ నినాదంతో జరిగిన ర్యాలీనుద్దేశించి న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాహుల్ ప్రసంగించారు. మోదీని మాత్రమే టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకోవాలనుకునే బీజేపీ-ఆరెస్సెస్ ఆటల్ని కాంగ్రెస్ పార్టీ సాగనివ్వబోదని హెచ్చరించారు. 30 నిమిషాల స్పీచ్ లో 17 సార్లు మోదీ పేరును ప్రస్తావిస్తూ.. ఆవేశంతో ఊగిపోయాడు రాహుల్.

‘బేటీ బచావ్’ అంటున్న మోదీ.. ఇప్పుడు ఎవ్వర్ని కాపాడుతున్నారు.. బీజేపీ ప్రభుత్వాల్ని, బీజేపీ ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని..” అంటూ ఎద్దేవా చేశారు. మన ప్రధాని మోదీకి కేవలం తన మీదే తప్ప మరోదాని మీద ఆసక్తి లేదన్న రాహుల్.. మోదీ అహంభావం గురించి విప్పిచెప్పబోయారు. కేవలం 15 నిముషాలు నాతో డిబేట్లో పార్టిసిపేట్ చెయ్.. నేనడిగే ప్రశ్నలకు దమ్ముంటే జవాబులు చెప్పు.. అంటూ బహిరంగ ఛాలెంజ్ విసిరారు రాహుల్ గాంధీ.

2014 జనరల్ ఎలక్షన్స్‌కి ముందు.. మోదీతో టీవీ చర్చల్లో పాల్గొన్నప్పుడు.. విపరీతంగా తడబడి.. పూర్తి డిఫెన్స్‌లో పడిపోయిన రాహుల్ గాంధీయేనా ఈ ఛాలెంజ్ విసురుతున్నాడు.. అంటూ నేషనల్ మీడియా నోరెళ్ళబెట్టేసింది. ఇంతకీ.. ఈ సవాల్‌కి మోదీ ఓకె చెబుతారా? లేక.. రాహుల్‌దే అప్పర్ హ్యాండ్ అంటూ సరెండర్ అయిపోతారా? అనేది సోషల్ మీడియాను ఏలేస్తున్న బిగ్ క్వశ్చన్!

READ ALSO

Related News