India / Politics
మీరు బాబర్ భక్తులు.. ఖిల్జీ బంధువు కూడా ! బీజేపీ సెటైర్స్
రేపో, మాపో కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎక్కనున్న రాహుల్ మీద బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయోధ్య సమస్యపై రాహుల్ వైఖరి ఏమిటో తేల్చాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేయగా..పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్. నరసింహారావు మరో అడుగు ముందుకేసి.. రాహుల్ ని ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ బంధువుగా, బాబర్ " భక్తుని " గా అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు.
అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్... ఒవైసీలు, జిలానీలతో కుమ్మక్కయ్యారని,  ఆయన తప్పకుండా  మొఘల్ చక్రవర్తి బాబర్ భక్తుడు, ఖిల్జీ బంధువని సెటైర్ వేశారు. రామాలయాన్ని బాబర్, సోమనాథాలయాన్ని ఖిల్జీ ధ్వంసం చేశారన్నారు. ఇస్లామిక్ ఆక్రమణదారులతో నెహ్రూ కుటుంబం లాలూచీ పడిందని..ఈ రెండూ తీవ్రంగా ఖండించదగినవని నరసింహారావు పేర్కొన్నారు. అటు-రాహుల్ ఓ వైపు ఆలయాలను సందర్శిస్తూ..మరోవైపు అయోధ్య సమస్యపై కప్పదాటు వేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. కీలకమైన ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. 
 

Read Also

 
Related News