ఏపీ ‘పూతరేకు’కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లోని పూతరేకుకు గుర్తింపు లభించింది. ఆత్రేయపురానికి చెందిన ఈ స్వీట్‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. దీనికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీ పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది.

గురువారం విజయవాడలో ఆత్రేయపురానికి చెందిన స్వీట్ నిపుణుల సాయంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 10 మీటర్ల పొడవైన పూతరేకును తయారు చేశారు.

దేశంలో ఇది అతిపెద్దగా గుర్తించిన ఇండియా బుక్ ప్రతినిధులు, నిర్వాహకులకు ధ్రువీకరణపత్రం అందజేశారు. తాము తయారు చేసిన ఈ పూతరేకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం దక్కడంపై ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. వివిధ రాష్ర్టాల్లో పూతరేకుకు వున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు.

READ ALSO

Related News