ఏపీ సోదరులపై చూపే సంస్కారం ఇదేనా?

60 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి ఉన్న మన తోటి తెలుగు సోదరులపై టీఆర్‌ఎస్‌ నాయకులు చూపే సంస్కారం ఇదేనా? అంటూ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ వెల్‌లోకి వెళ్లి అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. జై ఆంధ్రా అంటూ మద్దతు పలికిన ఎంపీ కవిత ఇప్పుడు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వడంలేదని పొన్నం ప్రశ్నించారు.

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో టీఆర్‌ఎస్‌ పాత్రధారి అంటూ పొన్నం ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన బూర నర్సయ్యగౌడ్‌ వ్యాఖ్యలను పొన్నం తీవ్రంగా ఖండించారు. ‘పక్కింట్లో పెళ్లయితే.. మన ఇంటికి రంగులు వేసుకుంటామా?’ అని నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలకు.. ‘పక్కింట్లో శవం ఉంటే.. మన ఇంట్లో డప్పు కొట్టి సంబరాలు చేసుకుంటామా?’ అని పొన్నం ప్రభాకర్‌ కౌంటరిచ్చారు.

Related News