పోలవరమే లాస్ట్ అండ్ ఫైనల్

పోలవరమే లాస్ట్ అండ్ ఫైనల్ అని.. ఇక ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇక ఏ రాష్ట్రంలోని ప్రాజెక్టులనూ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబోమంది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభలో సీపీఎం ఎంపీ మహమ్మద్‌ సలీం అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు పోలవరానికి జాతీయ హోదా కల్పించారని, అందుకే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని పనిచేస్తున్నామన్నారు.

కొండ ప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్రం, మిగతా 10 శాతం రాష్ట్రాలు సమకూరుస్తాయని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. గడ్కరీ సమాధానంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ వివరణ కోరడానికి ప్రయత్నించినా అవకాశం రాకపోవడంతో ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారమే తెలంగాణ కూడా ఏర్పడిందని ఆసందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా ఇస్తామన్నారని ఎంపీ వినోద్ లేఖలో గుర్తు చేశారు.

READ ALSO

Related News