మోదీ వ్యాఖ్యలనే డిలిట్ చేశారు

పార్లమెంటులో ఓ కాంగ్రెస్ నేత పట్ల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని రికార్డులనుంచి తొలగించడం అనూహ్య పరిణామం. ఇటీవలికాలంలో ఇది అరుదైన ‘ఘటన’  అని, ప్రభుత్వాన్ని ఇరకాటానబెట్టేదేనని అంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ప్రభుత్వం ప్రతిపాదించిన హరివంశ్ నారాయణ్ ఎన్నికైన అనంతరం.. మోదీ..కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదం సృష్టించాయి.

తమ అభ్యర్థి హరివంశ్ ను అభినందించిన సందర్భంగా మోదీ.. ‘ ఇద్దరు హరిల మధ్య ఈ పోటీ ‘ జరిగిందని, హరి అనే ఆయన తన పేరులోని మొదటి రెండు అక్షరాలతో కాంటెస్ట్ చేశారని సెటైరిక్ గా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు దీనిపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో..మోదీ ఆ తరువాత తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. హరిప్రసాద్ చివరి ప్రయత్నంగా ప్రజాస్వామ్య గౌరవాన్ని పరిరక్షించేందుకు తనవంతు కృషి చేశారని ఆయన అభినందించారు. చివరకు విపక్షాల నిరసనతో ఆయన కామెంట్లలో కొన్నింటిని రికార్డుల నుంచి తొలగించారు. 2013 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి విపక్ష నేత అరుణ్ జైట్లీ మధ్య జరిగిన విమర్శనాత్మక వ్యాఖ్యల సందర్భంలోనూ ఇలాంటి ‘ సన్నివేశమే ‘ చోటు చేసుకుంది. ఇద్దరి వ్యాఖ్యాలనూ రికార్డులనుంచి తొలగించారు.

READ ALSO

Related News