మాది ఉత్తరాది పార్టీ కాదు-మోదీ

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది పార్టీ అంటూ బీజేపీపై ఓ రకమైన ముద్ర వేశారని.. కానీ, హిందీయేతర రాష్ర్టంలో కూడా గెలిచి నిరూపించామన్నారు. బీజేపీని ఇప్పటివరకు హిందీ భాష పార్టీ అనేవాళ్లని, గుజరాత్, మహారాష్ర్ట, గోవా, అసోం హిందీ భాషా రాష్ర్టాలు కావని గుర్తుచేశారు. ఇప్పుడు కర్ణాటక కూడా ఈ అపవాదు తప్పని మరోసారి నిరూపించిందన్నారు. కొన్ని పార్టీలు స్వలాభం కోసం కేంద్ర- రాష్ర్ట ప్రభుత్వాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశాయని, ఈ గొడవలు సమాఖ్య స్ఫూర్తికి నష్టం కలిగించాయని ఆరోపించారు.

‘‘గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ రాష్ర్ట భాష రాదని ఎగతాళి చేసేవారు.. కర్ణాటక ప్రజలు ఎలాంటి భేదభావాలు లేకుండా నన్ను ఆదరించారు’’ అన్నారు. వారణాసిలో ఫ్లైఓవర్ కూలిన ఘటన కారణంగా కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ ALSO

Related News