World / General
అరె ! మోదీ ఎక్కడున్నారబ్బా ?

ఫిలిప్పీన్స్ (మనీలా) లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సమ్మిట్ లో ప్రపంచ నాయకుల గ్రూప్ ఫోటో ఒకటి సంచలనమైంది. అమెరికా పెద్దన్న ట్రంప్ అందరి మధ్యా సెంటర్లో నిలబడి..అయోమయం సృష్టిస్తూ ..అటూఇటూ రెండు చేతులూ కలిపి (వింతయిన హ్యాండ్ షేక్ ) కరచాలనాలు చేసి " జోకర్ " అవతారమెత్తారు. బహుశా ఇక్కడా ఆయనలోని కమెడియన్ బయటపడినట్టే !

ఆనవాయితీకి భిన్నంగా జరిగిన ఈ కరచాలనాల తంతులో ఈయనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. మనోడు ఎక్కడికి వెళ్ళినా ఇలా ఏదో ఒక ప్రహసనం సృష్టించక మానడనే కామెంట్లు వినబడుతున్నాయి. ఆ మధ్య గల్ఫ్ దేశాల పర్యటనలో నడుస్తూ తన భార్య మెలనియా చేతిని పట్టుకోవడానికి యత్నించడం. ఆమె విసిరికొట్టినంత పని చేయడం గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఆయన ఇలా .. ఇంతకీ వీళ్ళలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నారో అని కళ్ళింత చేసుకుని చూస్తే..ఈ లైన్లో ఎక్కడో చివర కాంబోడియా ప్రధాని, ఐరాస సెక్రటరీ జనరల్ పక్కన నిలబడి కనిపించారు.

మన సంబంధాలు పెరుగుతున్నాయ్ 

భారత, అమెరికా దేశాల మధ్య సంబంధాలు ఊహించలేనంతగా పెరుగుతున్నాయని, భవిష్యత్ లో ఆసియా దేశాల ప్రయోజనాల కోసం తాము కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మనీలాలో 31 వ ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హాజరైన ఆయన..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు.
 
ఉభయ దేశాల రక్షణ, వాణిజ్యం, కౌంటర్ టెర్రరిజం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత వంటి వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించారు. భారత, అమెరికా దేశాలను సన్నిహితం చేసేందుకు మోదీ చేస్తున్న కృషిని ట్రంప్ ప్రశంసించారు.

 

Read Also

 
Related News