AP / Politics
కులనాయకుడ్ని చేద్దామని కుట్రచేస్తే ఊరుకోను: పవన్

తనను కులనాయకుడ్ని చేద్దామని కుట్రలు పన్నితే ఊరుకోనన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కొంతమంది పవన్ చుట్టూ ఆయన కులంవాళ్లు తిరిగారంటున్నారు.. కరీంనగర్, బళ్లారి తిరిగినప్పుడు పవన్ కులం గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కులం విషయం మాట్లాడితే ఏ సంస్థలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెబుతానన్నారు. నిస్వార్థనేతలు పక్కన లేనందున ఆనాడు చిరంజీవి ఓడిపోయారని.. పీఆర్పీకి ద్రోహం చేసిన వాళ్లలో పరకాల ప్రభాకర్ ఒకరని పవన్ చెప్పారు.

ఆయన సతీమణి కేంద్రమంత్రి అయినా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని పరకాలను, పవన్ ప్రశ్నించారు. రాజకీయపునర్మాణంకోసం నడిచేవాళ్లు మాత్రమే నా దగ్గరకు రావాలని పవన్ కోరారు. పోలవరం పై అద్యయనం చేసే సహనం కూడా కొందరు నేతలకు లేదన్నారు. బలప్రదర్శన ద్వారా కాపు రిజర్వేషన్లు రావన్నారు. బీసీ సంఘం ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య కాపులను బీసీలలో కలిపితే ఒప్పుకోనంటున్నారు.. మరి.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టినప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకించలేదని.. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్య ఎలా పోటీ చేశారని పవన్ రాజమండ్రిలో ప్రశ్నించారు.

 

Read Also

 
Related News