బన్నీ ఫ్యాన్స్‌కి రాంగ్ సిగ్నల్స్!

పవన్‌కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ ఎపిసోడ్‌ నుంచి విచిత్రమైన సైడ్‌లైన్స్ బయటకు వస్తున్నాయి. తల్లి సెంటిమెంట్‌తో ఒక్కచోట చేరిన మెగా పక్షులన్నీ ఫ్యాన్స్‌కి ఒకరకమైన ‘పండగ’ వాతావరణాన్ని కల్పించాయి. పవన్‌కల్యాణ్, నాగబాబు, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లుఅర్జున్, అల్లు శిరీష్.. ఇలా మెగా క్యాంప్ హీరోలందరూ ఫిల్మ్ ఛాంబర్ వెతుక్కుంటూ వచ్చి అక్కడున్న ఫ్యాన్స్‌ని ‘పిచ్చెక్కించారు’.

సందర్భం సీరియస్‌ అయినప్పటికీ తమ అభిమాన హీరోలందరూ ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదంతా ఒకెత్తయితే బన్నీ-పవన్ కాంబో పిక్ మరొక ఎత్తు. పవన్ కల్యాణ్- అల్లు అర్జున్ ఒకొరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయతను ఒలకబోయడం కొత్తగా అనిపించింది. ఈ హగ్ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లో బన్నీ, నేరుగా పవన్ ఫ్యాన్స్‌ మీద సీరియస్ సెటైర్లు వేశారు. ఇద్దరు హీరో అభిమానుల మధ్య అడపాదడపా గొడవలు కూడా జరిగినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

 

ఈ నేపథ్యంలో స్టైలిష్‌స్టార్- పవర్ స్టార్ కావలించుకోవడం మెగా ఫ్యాన్స్‌ని ఆలోచింపజేస్తోంది. త్వరలోనే విడుదలయ్యే ‘నాపేరు సూర్య’ మెగా ఫ్యామిలీ మూవీగా చెబుతున్నారు. బన్నీ హీరోగా రానున్న ఈ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్లలో నాగబాబు కూడా ఒకరు. మరి బన్నీ ఫ్యాన్స్‌కి పవర్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దొరకుతుందా?

READ ALSO

Related News