మరో హిట్టు కొట్టిన జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్నుంచి నరుక్కొస్తున్నారు. పూర్తిగా రెండో తరం నాయకత్వంపై కన్నేసినట్లు అయన పోకడను బట్టి తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో వున్న పవన్.. పనిలోపనిగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ని కూడా కానిచ్చేసుకుంటున్నారు. 60 సంవత్సరాల రాజకీయ ఉద్దండుడు, కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటు, నర్సాపూర్ మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామ జోగయ్య.. జనసేనలో కర్చీఫ్ వేసుకున్నారు. కానీ.. అది తన కోసం కాదు. తన రాజకీయ ప్రస్థానం దాదాపు చరమాంకంలో పడడంతో తన వారసుడు చేగొండి సూర్యప్రకాష్‌ని పవన్‌కళ్యాణ్ టీంలో చేర్చేశారు.

నిజానికి.. చేగొండి హరిరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరారు. సౌమ్యుడు, పరిజ్ఞానవంతుడుగా పేరున్న హరిరామజోగయ్య ప్రజారాజ్యం తరఫున చిరంజీవి భావజాలాన్ని జనంలోకి తీసుకుపోవడంలో బాగా కష్టపడ్డారు. ఆ తర్వాత 2014లో బైటికొచ్చి వైసీపీలో చేరి.. ఆ పార్టీని కూడా వీడి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. తన పలుకుబడిని, వారసత్వాన్ని కొడుకు సూర్యప్రకాష్‌కి ధారాదత్తం చేసి అతడ్ని జనసేన ద్వారా ఎదిగేలా చేయడం చేగొండి ఆశయంగా తెలుస్తోంది.

Related News