పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పద్మవిభూషణ్ అవార్డుని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. క్రీడల్లో శ్రీకాంత్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు.

వివిధ రంగాలకు చెందిన 41 మందికి పద్మ పురస్కారాల ప్రదానం చేశారు. మిగిలిన వారికి ఏప్రిల్ రెండున జరిగే కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్ రాగా అందులో ఇళయరాజా కూడా వున్నారు. 9 మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశ్రీ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే!

 

Related News