అతడ్ని విడుదల చేయండి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మోడల్ జెసికా లాల్ హత్య కేసులో దోషి, యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న 41 ఏళ్ళ మనుశర్మను క్షమిస్తున్నానని, అతడ్ని జైలు నుంచి విడుదల చేయాలని జెసికా సోదరి సబ్రినా లాల్ కోరింది. ఈ మేరకు ఆమె ఢిల్లీ తీహార్ జైలు అధికారులకు లేఖ రాసింది. జైల్లో మనుశర్మ సత్ప్రవర్తన గురించి తెలుసుకున్న తాను ఈ లేఖ పంపుతున్నట్టు పేర్కొంది.

దాదాపు 15 సంవత్సరాలుగా జైల్లో ఉన్న మనుశర్మ సేవా సంస్థలకు, జైల్లోని ఖైదీల పిల్లల సంక్షేమానికి సహాయపడినట్టు తెలిసిందని, అందువల్ల అతడి విడుదలకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సబ్రినా లాల్ గత మార్చి 5 న రాసిన లేఖలో స్పష్టం చేసింది. తన సత్ప్రవర్తన కారణంగా మనుశర్మ ఆరు నెలలుగా ఓపెన్ జైల్లో ఉన్నాడు. జెసికా లాల్ హత్య పూర్వాపరాల్లోకి వెళ్తే..ఓ ప్రైవేట్ బార్ లో పని చేస్తున్న జెసికా లాల్ 1999 లో హత్యకు గురైంది. నాడు మాజీ మంత్రి వినోద్ శర్మ కొడుకుతో బార్ కు వెళ్ళిన మనుశర్మ.. .. తనకు మద్యం తెచ్చేందుకు నిరాకరించిందన్న కోపంతో తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు..అప్పట్లో ఇది దేశవ్యాప్త సంచలనమైంది.

READ ALSO

Related News