‘ఎన్టీయార్’ ఫస్ట్ లుక్.. అన్నగారు మళ్ళీ పుట్టినట్లే!

‘ఎన్టీయార్’ బయోపిక్‌లో మరో కీలక ఘట్టం షురూ అయ్యింది. కొడుకు బాలయ్య.. నాన్న పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి నటించిన ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యింది. తెలుగు జాతిరత్నం, నందమూరి అందగాడు, ఆంధ్రుల ఆరాధ్య నటుడు.. ఈ క్వాలిటీలన్నీ కలగలిపినట్లు ‘ఎన్టీఆర్’ గెటప్ అదిరిపోయేలా వుంది. NBK ఫిలిమ్స్ పతాకంపై వారాహి చలనచిత్ర సమర్పణలో తయారవుతున్న ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలకృష్ణ ఎన్టీయార్ రోల్ చేస్తుండగా, భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ వెర్సటైల్ నటి విద్యాబాలన్ పోషిస్తోంది. ఎన్టీయార్ రాజకీయ వారసుడు చంద్రబాబుగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్.. స్వతంత్ర దినోత్సవ కానుకగా అభిమానులను అలరిస్తోంది.

కాషాయ వస్త్రధారణ, మెళ్ళో రుద్రాక్షమాల, నుదుట విభూతి.. హావభావాలు, ఆహార్యం అన్నీఅచ్చుగుద్దినట్లు ఎన్టీయార్‌లానే అమరినప్పటికీ.. ఏదో వెలితి మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటూ ఫస్ట్ రివ్యూలు చెబుతున్నాయి. ఎన్టీయార్ ముఖ వర్చస్సుకి ఆభరణం లాంటి గంభీరమైన నవ్వుని బాలయ్య పలికించలేక పొయ్యాడంటూ సునిశిత విమర్శనం కూడా వినిపిస్తోంది. ఏదేమైనా అన్న అన్నే.. నాన్న నాన్నే! అంటూ మరోవైపు నుంచి నిట్టూర్పులు కూడా!

Related News