ఆయనతో జూనియర్ కమిట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి లేటెస్ట్ న్యూస్. త్రివిక్రమ్‌, రాజమౌళిల తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ ఫిల్మ్‌కి ప్లాన్ చేసినట్టు టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకడు. రాజా రాణి, మెర్సల్ వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్‌గా అట్లీకి ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ సమాచారం. కాకపోతే ఈ కాంబో సెట్స్‌ మీదకు వెళ్లడం వచ్చేఏడాది చివరలో కావచ్చని సమాచారం.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లోని ఓ వర్గం మాత్రం అట్లీతో ప్రాజెక్ట్ చేయవద్దని అంటోంది. తమిళ దర్శకులు.. అక్కడి ఆడియన్స్‌ని ఫోకస్ చేస్తూ స్టోరీని రెడీ చేస్తారని, తెలుగులో వర్కవుట్ కాదని అంటున్నారు. అందుకు ఎగ్జాంఫుల్ మురుగదాస్- మహేష్‌బాబు కాంబోలో వచ్చిన ‘స్పైడర్’ని చూపిస్తున్నారు. ఎన్టీఆర్- అట్లీ సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా గ్యాప్ వుండడంతో ఈ మధ్యలో ఏమైనా జరగొచ్చని అంటున్నారు.

Related News