ప్రధాని మోదీకి ఈసీ ఝలక్!

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన సూచనపై ఎన్నికల కమిషన్ (ఈసీ) వెంటనే స్పందించింది. జమిలి ఎన్నికలు సాధ్యం కాదని, ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాధనా సంపత్తి తమవద్ద లేదని పేర్కొంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎలెక్షన్స్‌తో బాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించజాలమని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పి.రావత్ తెలిపారు.

జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వీవీపాట్ యంత్రాలు తమవద్ద లేవన్నారు. ఏకకాల ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని రెండు నుంచి మూడు నెలల్లోగా తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ యంత్రాల కోసం ముందే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది కూడా.అవి సకాలంలో అందుతాయా అన్నది సందేహాస్పదమేనని ఆయన అభిప్రాయ పడ్డారు. జమిలి ఎన్నికలను నిర్వహిస్తే ప్రభుత్వంపై  ఖర్చు చాలా తగ్గుతుందని అమిత్ షా..లా కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈసీ తాజా ప్రకటనతో.. మోదీ సర్కార్ ప్రతిపాదించిన ప్రధాన ఎన్నికల సంస్కరణకు చెక్ పడ్డట్టే!

Related News