సాహితీవేత్త, నోబెల్‌ గ్రహీత నైపాల్‌ ఇక లేరు

భారత సంతతి చెందిన రచయిత, నోబెల్‌ గ్రహీత వీఎస్‌ నైపాల్‌ మరణించారు. ఆయన వయసు 85 ఏళ్లు. అనారోగ్యంతో ఆయన లండన్‌లోని తన నివాసంలో కన్నుమూసినట్టు ఫ్యామిలీ సభ్యులు తెలిపారు. నైపాల్‌ పూర్తిపేరు విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. 17 ఆగస్టు 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో జన్మించిన ఆయన.. ఇరవై ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు.

వలసవాదం, రాజకీయాలు, మత ఛాందస వాదాలపై ఎలుగెత్తారు. 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. ఇన్ ఎ ఫ్రీ స్టేట్ అనే రచనకు గానూ 1971లో బుక్కర్ ప్రైజ్ అందుకున్నారు. 1962లో తన పూర్వీకుల స్వస్థలం భారత్‌కు విచ్చేసిన నైపాల్, ఆ ప్రాంతంలోనే ‘ఏరియా ఆఫ్ డార్క్‌నెస్’ రచన చేశారు. 1955లో అన్నా హేల్‌ను పెళ్లి చేసుకున్న ఆయన, ఆమె మరణం తర్వాత పాకిస్థానీ జర్నలిస్ట్ నదీరాను వివాహమాడారు. 30కిపైగా రచనలు చేసిన నైపాల్ సాహిత్యంలో తనదైన ముద్రవేశారు. మరోవైపు నైపాల్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతోపాటు రాజకీయ నాయకులు నివాళులర్పించారు.

READ ALSO

Related News