జేడీఎస్‌,కాంగ్రెస్ పార్టీలకు సుప్రీం షాక్

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్పనే గవర్నర్ ఆహ్వానించడంతో దాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు
హుటాహుటీన సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. దీంతో పరిస్థితుల తీవ్రత దృష్యా అంతే స్పీడ్ గా సుప్రీం కోర్టు స్పందించింది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఈ తెల్లవారుజామున 5.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే, మధ్యాహ్నం 2గంటల్లోగా బీజేపీకి మద్దతిచ్చే సభ్యుల సంతకాలతో కూడిన లేఖను సమర్పించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, సుప్రీంకోర్టులో కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117మంది ఎమ్మెల్యేల మద్దతుందని సంఘ్వి కోర్టుకు విన్నవించారు. 104మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న యడ్యూపర్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని సంఘ్వి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప తరపున మాజీ ఏజీ ముఖుల్ రోహత్గి వాదించారు. రెండు గంటలకు పైగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను రేపు ఉదయం 10.30కు వాయిదా వేసింది. దీంతో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా నిలువరించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ప్రయత్నాలు బెడిసికొట్టినట్టయ్యాయి.

ఇదిలాఉండగా, నాడు గోవాలో మనోహర్ పారికర్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో ..తమను ఆహ్వానించకపోవడం అన్యాయమంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చివరికి కోర్టు.. కాంగ్రెస్ పార్టీనే మందలించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ గవర్నర్ వద్ద పరేడ్ వంటి ప్రయత్నం చేయలేదని, ఇది ఆ పార్టీ చేసిన తప్పిదమని పేర్కొంది. ఐతే బీజేపీని 15 రోజుల్లోగా కాకుండా 48 గంటల్లో మెజారిటీని నిరూపించుకోవాలని ఆదేశించింది.

 

అయితే, ఇప్పటి పరిస్థితి వేరు. కర్ణాటక గవర్నర్ వద్ద తమ కూటమికి చెందిన 116 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ కు కాంగ్రెస్, జేడీఎస్ సిద్దమైంది. అయితే ఇందుకు గవర్నర్ నిరాకరించారు. కేవలం పదిమందితో కూడిన డెలిగేషన్‌ను మాత్రమే ఆయన అనుమతించారు. ఇదిలాఉంటే, సుప్రీంకోర్టు బీజేపీని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపలేమంటూ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.

READ ALSO

Related News