న్యాయం చేస్తామన్న వాళ్లేరీ ?

మూడో పెళ్లి చేసుకుని తనను, తన బిడ్డను ఇంటి నుంచి గెంటి వేసిన తన భర్త శ్రీనివాస రెడ్డి, అతనితో బాటు అతని తల్లి, తండ్రి బెయిల్ పొంది దర్జాగా బయట తిరుగుతున్నారని హైదరాబాద్ లో భర్త ఇంటిముందు దీక్ష చేస్తున్న సంగీత ఆరోపిస్తోంది. బోడుప్పల్ సరస్వతీ నగర్ కాలనీలో భర్త ఇంటి ఎదుట ఆమె చేస్తున్న నిరసన దీక్ష సోమవారానికి 51 వ రోజుకు చేరుకుంది.

భర్త శ్రీనివాస రెడ్డి, అతని తల్లి ఐలమ్మ, తండ్రి బాల్ రెడ్డి తనకు న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తానని సంగీత తెలిపింది. 50 రోజులుగా దీక్ష చేస్తున్నా అత్తింటివారి నుంచి గానీ, రాజకీయ పక్షాల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదని ఆమె వాపోయింది.న్యాయం జరిగేలా చూస్తానన్న మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి జాడ లేదని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది. కాగా బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి.

Related News