నో క్యాష్ ప్లీజ్..మళ్ళీ అవే కష్టాలు

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ” ఏటీఎం” కష్టాలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ ముందు ఏటీఎంల ముందు తిరిగి ఖాతాదారుల చాంతాడు క్యూలు దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడడంతో ఏటీఎంలలోనూ క్యాష్ కొరత ఏర్పడి నో క్యాష్ బోర్డులో, ఔటాఫ్ సర్వీస్ బోర్డులో కనిపిస్తున్నాయి ఖాతాదారులు బ్యాంకుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీం నగర్ వంటి అనేక జిల్లాల్లో తాజాగా ఇదే పరిస్థితి ! ఏపీలోనూ దాదాపుగా ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు తగినంత నగదు రానందున ఏటీఎంలలో క్యాష్ నింపలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. పండుగకు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు డబ్బులు లేక వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా అన్నది వారిని వేధిస్తున్న ప్రశ్న.

 

Related News