‘ముద్ర’ నిఖిల్‌కి కలిసొస్తుందా?

నిఖిల్ – లావణ్యత్రిపాఠి తొలిసారి నటిస్తున్న మూవీ ‘ముద్ర’. ప్రస్తుతం 70 శాతం షూట్ పూర్తికావడంతో మిగతాది కూడా సెప్టెంబర్ చివరినాటికి ఫినిష్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ వున్నారు. ఐతే, దీపావళి సందర్భంగా నవంబర్ 8న ముద్ర రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

కోలీవుడ్‌లోని ఓ మూవీ నుంచి తీసుకున్న ఓ లైన్ ఆధారంగా స్టోరీని డెవలప్ చేసి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో ఈ ఫిల్మ్ రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం తనకు హిట్ తెచ్చి పెడుతుందనే ఆలోచనలో నిఖిల్ వుండగా, దీంతో తాను మళ్లీ బిజీ అవుతానని అనుకుంటోంది లావణ్య. దీనికి టీఎన్ సంతోష్ డైరెక్టర్.

READ ALSO

Related News