కేసు విత్‌డ్రా చేసుకుంటేనే..

తనపై తన భార్య సంగీత పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటేనే ఆమెతో కాపురం చేస్తానని ఆమె భర్త శ్రీనివాస రెడ్డి అంటున్నాడు. కేసులుంటే కాపురం చేయడం కష్టమని వాదిస్తున్నాడు. నేను నా తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటానని చెబుతున్నాడు. హైదరాబాద్ బోడుప్పల్ లో కోర్టు ఆదేశాలతో సంగీత మళ్ళీ తన పాపతో సహా అత్తవారింట్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నా మీద సంగీత పెట్టిన కేసును ఎందుకు వెనక్కి తీసుకోదు అని శ్రీనివాస రెడ్డి ప్రశ్నిస్తున్నాడు.

అటు-తన భర్త, అత్తమామలపై ఫిర్యాదుకు సంబంధించిన కేసును నేను విత్ డ్రా చేసుకోనని సంగీత ఖరాఖండిగా చెబుతోంది. నాకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని, నన్ను బాగా చూసుకుంటారనే నమ్మకం కలిగే వరకు కేసు వాపసు తీసుకోనని ఆమె అంటోంది. దీంతో ఆమె కాపురం ఆమె భర్తతో సవ్యంగా సాగుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Related News