ట్రైలర్.. ‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే..

విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో రవితేజ- మాళవిక శర్మ నటించిన ‘నేల టిక్కెట్టు’ మూవీ ట్రైలర్ రిలీజైంది. రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో రవితేజ స్టయిల్, యాక్టింగ్‌లో ఏ మార్పు లేదు. ‘జీవితంలో తొలిసారి అమ్మ, అక్క, చెల్లి కాకుండా.. ఓ కొత్త బంధం కనిపిస్తోంది’ అంటూ రవితేజ తన ప్రియురాలి గురించి చెబుతూ కనిపించాడు. నా జీవితం, నా ఇష్టం.. నేను ఎదగడానికి ఎంత మందినైనా తొక్కేస్తాను అంటూ జగపతిబాబు డైలాగ్ చెప్పే డైలాగ్ బాగుంది. యాక్షన్‌, లవ్ సన్నివేశాలతో ట్రైలర్‌ని ఆసక్తికరంగా రూపొందించారు. వృద్ధులకు సాయం చేసే స్టోరీతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

 

READ ALSO

Related News