మోదీ కరెక్టయితే నేనూ కరెక్టే

మాజీ క్రికెటర్, పంజాబ్ మినిస్టర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్థాన్ టూర్ క్రమంగా వివాదాస్పదంగా మారుతోంది. దీనికి తోడు ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై ఇంటాబయటా విమర్శలు తీవ్రమవుతున్న వేళ.. మంగళవారం మీడియా ముందుకొచ్చిన సిద్ధూ, తనదైనశైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆనాడు ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి ఆహ్వానం లేకుండా పాక్‌లో దిగి షరీఫ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. తాను భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి కోసమే.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లానని కుండబద్దుల కొట్టేశారు సిద్ధూ. ఆనాడు మోదీ చేసింది కరెక్టయితే, ఇప్పుడు తాను చేసింది కరెక్టేనని ఒక్క ముక్కలో తేల్చేశారు.

1999లో లాహోర్‌కు బస్సు యాత్ర చేసిన దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి, భారత్‌ను సందర్శించాల్సిందిగా పాక్ సైనిక నియంత ముషర్రఫ్‌ను ఆహ్వానించారని అన్నారు. 2014లో ప్రధాని మోదీ కూడా తన ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. వారంతా కలసి మాట్లాడుకుని, కరచాలనం చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు సిద్ధూ.

 

Related News