బ్రిటన్ కేబినెట్‌లో నారాయణమూర్తి అల్లుడు

భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు బ్రిటన్‌లో ఉన్నతపదవి దక్కింది. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే.. ఆయన్ని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. రిషికి హౌసింగ్‌, కమ్యూనిటీస్‌, లోకల్‌ గవర్నమెంట్‌ శాఖ అప్పగించారు. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి వెల్లడించింది. రిషితోపాటు మరో భారతీయ సంతతి వ్యక్తి ఫెర్నాండెజ్‌కూ కేబినెట్‌లో చోటు దక్కడం విశేషం.

రిషి సునక్ ఎవరోకాదు.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడు. 36 ఏళ్ల రిషి.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో తన సహవిద్యార్థి, అక్షతామూర్తి (నారాయణ మూర్తి కూతురు)ని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత లండన్‌లో ఓ సంస్థను స్థాపించారు. 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రిషి, 2015లో బ్రిటన్‌ ఎన్నికల్లో నార్త్‌ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ ప్రాంతం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెల్సిందే!

Related News