India / Politics
వీర్ ప్రపోజ్ చేయగానే ఓకే అన్నా..

ప్రముఖ నటి నమిత ఈ నెల 24 న తన బెస్ట్ ఫ్రెండ్ వీర్ ని తిరుపతిలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా తన కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన సంగతులు కొన్ని తెలిపింది. వీర్ నిర్మాత, మంచి నటుడు కూడా అని, తమ ఇద్దరి కామన్ ఫ్రెండ్ అయిన శశిధర్ బాబు 2016 లో వీర్ ని తనకు పరిచయం చేశాడని ఆమె పేర్కొంది. ''గత సెప్టెంబర్ 6 న బీచ్ లో క్యాండిల్ లైట్ ఏర్పాటు చేసి వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. చాలా సర్ ప్రైజ్ అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశా'' అని నమిత వెల్లడించింది. గత మూడు నెలల్లో అతడ్ని ఎంతో అర్థం చేసుకున్నానని, మహిళలంటే అతనికి చాలా గౌరవమని తెలుసుకున్నానని నమిత పేర్కొంది. 

 

Read Also

 
Related News