బీజేపీకి గుడ్ బై.. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ?

బీజేపీని వీడుతున్నట్టు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత నాగం జనార్దన రెడ్డి ప్రకటించారు. తన మద్దతుదారులు, అభిమానుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. నాగర్ కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీలో తను ఎన్నో అవమానాలకు గురి కావలసి వచ్చిందని, తన సేవలను పార్టీ ఉపయోగించుకోలేక పోయిందని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై నేను రాజీలేని పోరాటం చేసినా కేంద్రం స్పందించలేదు అని నాగం జనార్దన రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులతో చేతులు కలపాలని భావిస్తున్నానని, ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తానని అన్నారు. 2019 లో నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తా. అవే నాకు చివరి ఎన్నికలు అన్నారాయన. కాగా-నాగం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఇదివరకే ఊహాగానాలు సాగాయి.

 

Related News