హాట్‌లుక్‌లో కళ్యాణ్‌రామ్

కళ్యాణ్‌రామ్- తమన్నా జంటగా రానున్న మూవీ ‘నా నువ్వే’. ఈనెల 25న విడుదల కానుండడంతో ప్రమోషన్ వేగవంతం చేసింది యూనిట్. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో కల్యాణ్‌ రామ్.. హీరోయిన్‌తో కాసింత హాట్‌గా కనిపించాడు. ఈ మధ్యకాలంలో కల్యాణ్ ఈ విధంగా కనిపించిన సందర్భంలేదని అంటున్నారు. ఇదంతా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మేకర్స్ వేసిన ఎత్తుగడగా వర్ణిస్తున్నారు. పనిలోపనిగా ఈ లుక్‌కి సంబంధించి ‘నిజమా మనసా’ అనే ఆడియో సాంగ్‌ని విడుదల చేశారు.

ఈ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్‌రామ్‌ తన లుక్‌ని కంప్లీట్‌గా మార్చేసి కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. కళ్యాణ్‌ వైపు నుంచి ఎఫర్ట్ బాగానేవున్నా, స్టోరీ ఎలా వుంటుందనేది ఆసక్తికరం. ‘పటాస్‌’తో హిట్‌ కొట్టిన కళ్యాణ్‌రామ్‌, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘నా నువ్వే’ ఏం చేస్తుందో చూడాలి. ఇందులో కళ్యాణ్‌రామ్- తమన్నాల మధ్య ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ బాగా పండిందని యూనిట్ చెబుతున్నమాట.

READ ALSO

Related News