India / General
తల్లీ, బిడ్డా కార్లో ఉండగానే..

ముంబై ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్నే మరిచారు. అస్వస్థతకు గురైన ఓ మహిళ కారు వెనుక సీటులో తన ఏడు నెలల పసి బిడ్డకు పాలిస్తుండగా.. రూల్స్ అతిక్రమించి కారు పార్క్ చేశారంటూ ..ఆ వాహనానికి ఇనుప గొలుసు తగిలించి తమ వెహికిల్ లో లాక్కెళ్ళారు వాళ్ళు.

తనకు జ్వరం వచ్చిందని బాధితురాలు మెడికల్ ప్రిస్ క్రిప్షన్ చూపినా వారు వినలేదు.కనీసం తనను కారు దిగనివ్వాలని కోరినా వాళ్ళు పట్టించుకోలేదని బాధితురాలైన జ్యోతి మాలే పేర్కొంది. శుక్రవారం ముంబైలోని మలద్ వెస్ట్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ దృశ్యం చూసి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన ముంబై ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి  శశాంక్ రాణే అనే ఆ ట్రాఫిక్ ఎస్సై ని సస్పెండ్ చేశారు. 

 

Read Also

 
Related News