సీఎం కుర్చీ ఇస్తే.. మీకే 20 వేల కోట్లు ఇస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం హీటెక్కింది. ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై జగన్‌ మొసలి కన్నీరు కార్చడాన్ని తప్పుపట్టారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. మాటతప్పను.. మడం తిప్పనంటున్న జగన్‌.. కాపు రిజర్వేషన్ల విషయంలో ఒక్కో సభలో ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాజాగా పది వేల కోట్లరూపాయలతో కాపు జాతిని కొనడానికి జగన్ సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని జగన్ చెప్పడం తమను ముమ్మాటికీ అవమానించినట్లేనని అన్నారు. కాపు నేతలు అమ్ముడుపోయే జాతిగా అందరూ భావించడం బాధాకరమన్నారు.

సీఎం కుర్చీ మాకిస్తే.. మీకే రూ. 20 వేల కోట్లిస్తామని జగన్‌కి చురక అంటించారు ముద్రగడ. తన సామాజికవర్గాన్ని కాపాడుకోవడానికే జగన్‌ పార్టీ పెట్టారని ఆరోపించారు. మరోవైపు ముద్రగడ ఆరోపణలపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. కాపు ఉద్యమం జోరుగా నడుస్తున్న వేళ ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. టీడీపీతో కుమ్మక్కై ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.

READ ALSO

Related News