త్రివిక్రమ్ పై రివర్స్ పంచ్! 

హీరోలు బానే వుంటారు.. వాళ్ళవాళ్ళ అభిమానుల మధ్యలోనే మాటలు.. మంటలు! ఒక హీరో సినిమా అటూఇటూ అయితే.. మిగతా హీరోల అభిమానులకు అదోరకం పండగ. మిగతా భాషల్లో సంగతేమో గానీ.. టాలీవుడ్ లో మాత్రం ఈ వెర్రి వేపకాయ సైజు దాటి చాలాకాలమే అయ్యింది. తాజాగా.. ‘అజ్ఞాతవాసి’ లీడ్స్ చూసిన పవనేతర ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో సందడి చెయ్యడం మొదలుపెట్టేశారు. ఈసారి.. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా టార్గెట్ అవుతున్నాడు.
 
  • దారి తప్పిన అజ్ఞాతవాసి.. ఇది త్రి’వక్రమ్’ సినిమా..
  • ”అభిమానుల కోసమే అయితే పక్కా మాస్ సినిమా తీయాలి… రీమేక్ చేయాలనిపిస్తే అఫీషియల్ గా కథ తీసుకొని అదే మూడ్ లో సినిమా చేయాలి.. ఫ్యాన్స్ పేరు చెప్పి యాక్షన్ సినిమాను కామెడీ డ్రామా చేస్తే పులిహోరే అవుతుంది…
  • ”ఇంక్ అయిపోయిన పెన్నుతో ఎన్ని మంత్రాలు వేసినా.. పారవని ఆ మాంత్రికుడికి తెలిసుండాలి…”
  • ”ఈ సారైనా తెలుసుకోవాలి.. ఒకసారి కథ దొబ్బేసి పేరేయటం మర్చిపోయా అన్నాడు..  ఈ సారి ఏం చెప్తాడో.. ఎంత టాలెంట్ ఉన్నా.. మరొకరి సొత్తు నాదే అని చెప్పుకోవటం భావ్యం కాదు.. ఇప్పటికైనా ఇది రీమేక్ అని చెప్తే.. కనీసం ఇన్స్‌పైర్ అయ్యాం అన్న మాటన్నా అంటే గౌరవంగా ఉంటుంది…
  • తండ్రీకొడుకుల సెంటిమెంట్, రొటీన్ రివెంజ్ స్టోరీ, ఇద్దరు హీరోయిన్లు, హీరోతో కామెడీ.. ఆ మాంత్రికుడికి తెలిసింది ఈ నాలుగు మంత్రాలే!
  • ‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’’
  • ”ఇది నిజంగా ‘అజ్ఞానవాస’మే.”

Related News