‘మహానటి’ దర్శక నిర్మాతలకు మంచు ఫ్యామిలీ సత్కారం

‘ మహానటి ‘ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమా టీమ్ ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఘనంగా సత్కరించగా..తాజాగా మంచు ఫ్యామిలీ ఈ చిత్ర దర్శక నిర్మాతలను తమ ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.

మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి వీరిని అభినందించారు. ఈ చిత్రంలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

READ ALSO

Related News