హైకోర్టు జడ్జిగా అంధుడు

రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా అంధుని నియామకం ఆసక్తిని రేకెత్తించింది. రాజస్తాన్ లోని భిల్ వారా ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన బ్రహ్మానంద శర్మ ..ఓ న్యాయమూర్తిగా ఉన్నత పదవిని చేపట్టడం విశేషం. 31 ఏళ్ళ ఈయన 2013 లో రాజస్తాన్ హైకోర్టు నిర్వహించిన జుడిషియల్ సర్వీస్ పరీక్షలో 83 వ ర్యాంకు సాధించాడు. అనంతరం కోర్టు అతనికి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి చిత్తోర్ గ ద్ లో పోస్టింగ్ ఇచ్చింది. అక్కడినుంచి ఇటీవలే శర్మ అజ్మీర్ లోని సర్వార్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడ్రు.

తన 22 వ ఏట గ్లూకోమా కారణంగా చూపు కోల్పోయినా..బ్రహ్మానంద శర్మ జడ్జి కావాలన్న తన ఆశయాన్ని మాత్రం వీడలేదు. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్న తన భార్య సహకారంతో జడ్జీని కాగలిగానని ఆయన అంటున్నారు. ‘ నేను మెజిస్ట్రేటు గా ఉన్నప్పుడు ఒక అంధుడు తమకు ఎలా న్యాయం చేస్తాడని పలువురు అనుమానం వ్యక్తం చేసేవారని, అయితే నేను మాత్రం నిజానిజాలు పరిశీలించి కేసు పరిష్కరించేవాడిని ‘ అని ఆయన తెలిపారు. ఇతర న్యాయమూర్తుల్లాగా కేసు నోట్స్ చదవని శర్మ.. ఇందుకు బదులు రికార్డు చేసిన ప్రొసీడింగ్స్ వింటారట.. వందలాది అడ్వకేట్లు కోర్టుకు వస్తుంటారని, వారి అడుగుల శబ్దం విని వారిని గుర్తించేవాడినని బ్రహ్మానంద శర్మ అంటున్నారు.

Related News