రొమాంటిక్ డ్రామా ‘మను’ ట్రైలర్

చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కొడుకు గౌతమ్‌ హీరోగా మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయన నటించిన సినిమాకి సంబంధించి మూడు నిమిషాల ట్రైలర్ విడుదలైంది. తీగకొండికి వానపామును వేస్తారు.. వానపామును చూస్తూ వెనకున్న తీగను వదిలేస్తుంది చేప.. ఆపై ఇరుక్కుంటుందంటూ సాగుతున్న ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ఎక్కువ క్యారెక్టర్స్‌ లేకుండా తక్కువ పాత్రలతోనే దీన్ని నడిపించినట్లు తెలుస్తోంది. షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన చాందిని చౌదరి ఈ ఫిల్మ్ ద్వారా హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో హీరోయిన్‌గా చేసినా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. పల్లకిలో పెళ్లికూతురు, బసంతి చిత్రాల తర్వాత గౌతమ్ నటిస్తున్న సినిమా ఇది. ఫణీంద్ర నర్శెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ ALSO

Related News