జైట్లీపై మండిపడిన లోకేష్

ఏటీఎంల్లో మనీ కావాల్సిన దానికంటే ఎక్కువే చలామణిలో ఉందంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌పై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి లోకేశ్‌.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా, అంతా బాగుందని జైట్లీ చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.

ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. నిధుల కొరతపై ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం నగదు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Related News