లింగాయత్ ‘తాయిలం’ తుస్సుమంది

కర్నాటక ఎన్నికలముందు లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘తాయిలం’ తుస్సుమంది. వారికి ప్రత్యేక మతపరమైన మైనారిటీ హోదా కల్పించి తమ వైపు తిప్పుకోవడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నించింది.

బీజేపీ అనుకూల లింగాయత్‌లు తమవైపే ఉన్న పక్షంలో మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యమని ఆశించింది. అయితే లింగాయత్‌లు కాంగ్రెస్‌ను ఛీ కొట్టినట్టు కనిపిస్తోంది. వారి ప్రభావం ఉన్న 37 నియోజకవర్గాల్లోనూ కమలం పార్టీ అభ్యర్థులే ముందంజలో కొనసాగారు.

లింగాయత్, వీరశైవ ఇష్యూ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేక ఫలితాన్నే ఇస్తుందని బీజేపీ సీఎం అభ్యర్థి
ఎడ్యూరప్ప గత ఏప్రిల్‌లోనే జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఫలించి.. పరిస్థితి అలాగే కొనసాగింది. ఇక.. కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా మద్దతునిస్తున్న ముస్లిం వర్గం కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

READ ALSO

Related News