అజ్ఞాత‌వాసి చూసి.. ‘లార్గోవించ్’ డైరెక్టర్ ఏమన్నాడు?

లార్గోవించ్ మూవీ డైరెక్టర్ జెరోమ్‌సలే మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. అజ్ఞాత‌వాసి.. ఫ్రెంచ్ సినిమా లార్గోవించ్‌కి కాపీ అని చెప్పిన ఆయన, దాని గురించి కొన్ని విషయాలు బయటపెట్టాడు. బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అజ్ఞాత‌వాసిని అమెరికాలో చూసిన ఆయన, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

లీబ్రాడేలో అజ్ఞాత‌వాసి మూవీ చూశానని, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని, దుర‌దృష్టం కొద్దీ లార్గోవించ్‌కి చాలా దగ్గరగా ఉందన్నాడు. స్టోరీ తన సినిమాకు దగ్గరగానేవున్నా చిత్రీకరణ ఆకట్టుకుందని జెరోమ్ చెప్పడం విశేషం.

Related News