AP and TS / General
ఈ స్థలాన్ని అపవిత్రం చేశారు

కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ వీర గ్రంథం చిత్రంపై లక్ష్మీ పార్వతి మండి పడ్డారు. ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసి ఈ స్థలాన్ని అపవిత్రం చేశారని ఆమె అన్నారు. మంగళవారం ఆమె ఈ ఘాట్ ను పాలతో శుద్ది చేశారు. ఎవరి అనుమతి తీసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.నా జీవితం గురించి సినిమా తీయడానికి వీళ్ళంతా ఎవరు ? ఈ చిత్రం మీద ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా అని లక్ష్మీ పార్వతి అన్నారు. కేతిరెడ్డి లాంటివారి వెనకున్న శక్తులు ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. 25 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి పేరును తన పేరు పక్కన చేర్చడం చట్ట విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా..ఆరు నూరైనా ఈ చిత్రం తీసి తీరుతానని కేతిరెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ పై ఒక సినిమా తీయడానికి ఆమె పర్మిషన్ కావాలా అన్నారాయన.

 

Read Also

 
Related News