హీరో విక్రం కొడుకు ఏం చేశాడంటే …

కోలీవుడ్ హీరో విక్రం కుమారుడు ధృవ్.. చెన్నై తేనాంపేటలోని ఓ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. ఆదివారం ఉదయం తన కారును వేగంగా నడుపుతూ అదుపు చేయలేక ఓ ఆటోను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ధృవ్ మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. అతడ్ని అరెస్టు చేసిన పాండీ బజార్ పోలీసులు అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

గత ఏడాది తెలుగులో హిట్ అయిన ‘ అర్జున్ రెడ్డి ‘ మూవీ తమిళ రీ-మేక్ లో ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ ‘వర్మ’గా ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తూ ధ్రువ్‌ బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. ​కారు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.

READ ALSO

Related News