ప్రపంచ శాంతిదూత మరిలేరు

ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ (80) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 18) తుదిశ్వాస విడిచారు. ప్రపంచ శాంతి కోసం పాటు పడ్డ కోఫి కృషికి గుర్తింపుగా 2001లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఆఫ్రికా ఖండం నుంచి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు కోఫి అన్నన్. 1938, ఏప్రిల్ 8‌న ఘనాలోని కుమాసి గ్రామంలో కోఫి‌అన్నన్ జన్మించారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ స్థాయిలలో పనిచేసిన కోఫి.. 1997 నుంచి 2006 వరకు సెక్రెటరీ జనరల్‌గా విధులు నిర్వహించి ప్రపంచదేశాలనుంచి ప్రశంసలు అందుకున్నారు.

Related News